Baddena kavi biography of alberta
సుమతీ శతక కర్త - కవి బద్దెన అని అంటారు కాని ఎక్కడ నిర్ధారించి చెప్పడం జరగలేదు. బద్దెన - భద్ర భూపాలుడు అనే చోళ రాజకుమారుడు.
13 వ శతాబ్దములో, కాకతీయ మహారాణి, రాణి రుద్రమదేవికి సామంత రాజుగా ఉండేవాడు. ఇతడు కవి త్రయంలో ఒక్కరైన తిక్కనామత్యునికి శిష్యుడు.
సుమతీ శతకం ప్రక్రియ నీతి శతకం. ఈ శతకం లో భాష సరళంగా, వ్యావహారికంగా, ఛందోబద్ధమై ఉంటుంది. పదాలు లాలిత్యం కూడి వినసొంపుగా ఉంటాయి.
ఎక్కడా క్లిష్టమైన సమాసాల ఉపయోగం జరగలేదు. అన్ని పదాలూ ఆధునిక సమాజంలో అర్ధమయేవిగా ఉండడం విశేషం. ఈ పద్యాలు కంద పద్యం ఛందస్సులో చేయబడ్డాయి.
నేటికీ కొన్ని పదాలు యెంత వాడుకలోకి వచ్చాయంటే, వాటి మూలం చాలామందికి తెలియకనే వాడడం విశేషం - "అప్పిచ్చు వాడు, వైద్యుడు..."
సుమతీ శతక కర్త బద్దెన అయినట్లయితే, తెలుగులో శతక ప్రక్రియ వచ్చిన పద్యాలలో పాల్కుర్కి సోమనాథ కవి రాసిన "వృషాధిప శతకం" తో పాటు ఆద్యమైన వాటిల్లో ఒకటిగ చెప్పుకొనవచ్చు.
అంతే కాక, పాశ్చాత్య భాషల్లోకి అనువదింపబడ్డ రచనల్లో కూడా ఆద్యమైనదిగా చెప్పుకొనవచ్చు